Latest Posts

ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్​ కలకలం!

దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్​ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్​ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది.

నో ఫ్లై జోన్​లో డ్రోన్​ ఎలా వచ్చింది?

ప్రధాని మోదీ నివాసం రెడ్​ నో ఫ్లై జోన్​/ నో డ్రోన్​ జోన్​ కిందకు వస్తుంది. అలాంటిది, ఎన్నడు లేని విధంగా.. మోదీ నివాసంపై డ్రోన్​ కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ కల్పించే ఇలైట్​ స్పెషల్​ ప్రొటెక్షన్​ గ్రూప్​ ఈ డ్రోన్​ను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Drone over PM Modi news : ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్​ను కనిపెట్టేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

“ప్రధాని నివాసానికి సమీపంలో అన్​ఐడెన్టిఫైడ్​ ప్లయింగ్​ ఆబ్జెక్ట్​ తిరుగుతున్నట్టు సమాచారం అందింది. వెంటనే స్పందించి సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాము. కానీ ఏం లభించలేదు. ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూమ్​ను సంప్రదించాము. వారు కూడా ఎలాంటి ఫ్లయింగ్​ ఆబ్జెక్ట్​ను గుర్తించలేదు,” అని దిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే ఇప్పటివరకు సంబంధిత డ్రోన్​ను పోలీసులు పట్టుకోలేదు. ఈ డ్రోన్​ ఎవరిది? అసలు నో ఫ్లై జోన్​లోకి ఎలా వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలో మోదీ పర్యటన..

PM Modi Telangana tour : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఓవైపు ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తుండగా….డైలాగ్ లు కూడా పేలుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసే పనిలో పడ్డాయి. మరోవైపు తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వస్తున్నాయి. కీలక నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో చర్చలు జరుపుతుండగా…. నాయకత్వ మార్పుపై కూడా జోరుగా జరుగుతుంది. ఇటీవలనే నడ్డా తెలంగాణ పర్యటనకు రాగా…. ప్రధాని మోదీ కూడా తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

YES9 TV