అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది.. నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడని కన్నతల్లి కొడుకును హతమార్చిన ఘటన వెలుగు చూసింది.. అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు శివాలయం సమీపంలో సునీతమ్మ అనే కన్నతల్లి సురేంద్ర ఆచారి అనే 28 ఏళ్ల యువకుడిని కత్తెరతో చాతిలో పొడిచి హత్య చేసింది. తండ్రి బ్రహ్మచారి, సునీతమ్మకు కుమారుడు సురేంద్ర ఆచారి, ఒక కూతురు ఉన్నారు.. చదువుకొని కుమారుడు ప్రయోజకుడౌతాడు అనుకుంటే మద్యానికి బానిసై నిత్యం డబ్బు కోసం వేధించేవాడు… కార్పెంటర్గా తండ్రి విధులు నిర్వహిస్తుంటే సహాయం చేయాల్సింది పోయి డబ్బు కోసం నిత్యం తల్లిదండ్రులను వేధించేవాడని తల్లి పోలీసులకు తెలిపింది… ఈ నేపథ్యంలోనే ఇవాళ మద్యం తాగి దాడి చేయడానికి వస్తే ఇంటిలో ఉన్న కత్తెరతో ఛాతిలో పోటీచే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు… సంఘటన స్థలానికి చేరుకున్న మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురంలో ఘోరం: మద్యానికి బానిసై వేధిస్తున్నాడని కన్నకొడుకునే కత్తెరతో పొడిచి చంపిన తల్లి!
