పంచాయతీ పరిధిలోని సమస్యలన్నింటిపై దృష్టి సాదిస్తాం
ముదిగుబ్బ మేజర్ పంచాయతీ
కార్యదర్శి నరేంద్ర…
ముదిగుబ్బ yes9 Tv
ముదిగుబ్బ మండల మేజర్ పంచాయతీ కార్యదర్శి నరేంద్ర స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ, ముదిగుబ్బ మండల కేంద్రంలోని స్థానిక బస్ షెల్టర్ నిరుపయోగంగా మారిన పరిస్థితిని స్థానిక వార్తా కథనాలతో గ్రహించి తగు చర్యలు చేపట్టామని, షెల్టర్ పరిసరాల్లోని తోపుడు బండ్ల ను మరియు చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయించామని అలాగే ఎంపీడీవో హాజీవలి మరియు ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి బస్సులను బస్సు షెల్టర్ వద్ద నిలుపుదల చేసేలా త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే వీధుల్లో అపరిశుభ్రత, త్రాగునీటి మరియు వీధి బల్బుల సమస్యలపై తక్షణమే స్పందించడానికి కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
పంచాయతీ పరిధిలోని సమస్యలన్నింటిపై దృష్టి సాదిస్తాం….
