ముదిగుబ్బ yes9TV
సత్యసాయి జిల్లా ముదిగుబ్బ,మండలంలోని నాగలగుబ్బ గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల పలుమార్లు ఎలుగుబంటి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించి, గ్రామ ప్రజల భద్రత కోసం తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
నాగలగుబ్బ సమీపంలో ఎలుగుబంటి సంచారం.. గ్రామస్తుల్లో భయాందోళన..
