వియత్నాం బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హిందూపురం రవితేజ భౌతికకాయం స్వగ్రామానికి చేరిక…

శ్రీ సత్య సాయి జిల్లా..

వియత్నాం బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హిందూపురం రవితేజ భౌతికకాయం స్వగ్రామానికి చేరిక.

ముంబై నుంచి విమానం లో హైదరాబాద్ చేరిన మృతదేహం

అక్కడి నుంచి అంబులెన్స్‌లో హిందూపురానికి మృతదేహం తరలింపు.

రవితేజ భౌతికకాయం చూసి కన్నీరుమున్నీరైన తల్లి, భార్య, పిల్లలు కుటుంబ సభ్యులు.

టీచర్స్ కాలనీలోవిషాదవాతావరణం నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజానీకం

హిందూపురం వ్యాపార వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రవితేజ మృతి.

కడచూపు కోసం భారీగా తరలివచ్చిన బంధువులు స్నేహితులు

నిన్నటివరకు మన మధ్యే ఉన్నాడు.నేడు శవపేటికలో వచ్చాడు అంటూ బంధువుల రోదనలు

కుటుంబానికి పెద్ద దిక్కైన రవితేజ మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు.

అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లు పూర్తి.

వియత్నాం బోటు ప్రమాదం హిందూపురంలోనూ విషాదాన్ని నింపిందంటూ స్థానికుల ఆవేదన.

రవితేజ మృతికి వ్యాపారులు, మిత్రులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం.

రవితేజ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించిన స్థానికులు.

Posted Under AP
Editor