పొలం పిలుస్తోంది కార్యక్రమం…

ముదిగుబ్బ yes9TV
మంగళవారం రంగాపురం, రాఘవపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల ప్రభావం నుంచి రైతులు గట్టెక్కే పరిస్థితులను వ్యవసాయ అధికారి రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా ఎల్నినో సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. వర్షా బావ పరిస్థితులను తట్టుకునే పంటలైన కంది, ఆముదము, అలసంద, పెసర వంటి పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. సెరికల్చర్ అధికారి రమేష్ మాట్లాడుతూ పట్టు సాగు చేయు రైతులకు ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బుదనంపల్లి, కొడవాoడ్లపల్లి రైతు సేవ కేంద్ర సిబ్బంది అమిరున్, మనోజ్ ప్రభాకర్ ,రైతులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor