Latest Posts

ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తొలగిన మురుగు..

  • ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తొలగిన మురుగు
  • గత పాలకుల నిర్లక్ష్యంతో అద్వాన్న స్థితిలో ఆసుపత్రి ప్రాంగణం
  • ఎమ్మెల్యే అమిలినేని పరిశీలనతో నేడు సర్వాంగా సుందరంగా ఆసుపత్రి ప్రాంగణం

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రధాన రహదారిలో వచ్చే మురుగు నీరు మొత్తం ఆసుపత్రి ప్రాంగణంలోకి వెళ్లి పందులకు నిలయంగా మారిపోయి ఉండేది.కుందుర్పి పర్యటన కోసం వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితి చూసి ఎందుకు ఇలా ఇంత అద్వానంగా ఉందొ అడిగి తెలుసుకుని అక్కడ పరిస్థితి మారాలంటే ఏమి చేయాలో స్థానిక నాయకులతో మాట్లాడి తెలుసుకున్నారు..ముందు ప్రధాన రహదారి నుంచి మురుగు ఆసుపత్రి ప్రాంగణంలో రాకుండా డ్రైనేజి ఏర్పాటు చేశారు..అనంతరం ఆసుపత్రి ఆవరణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు తొలగించి ఏకంగా 150 టిప్పర్లు మట్టిని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు తన స్వంత నిధులతో తోలించి చదును చేసి నేడు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు..దీంతో కుందుర్పి మండలంలోని ఆసుపత్రికి వచ్చే రోగులే కాకుండా మండల ప్రజలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు…

Posted Under AP
Editor