Latest Posts

పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి మండల వ్యవసాయ అధికారి…..

  • మండలం లో వున్న రైతులు
  • పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి మండల వ్యవసాయ అధికారి…

ముదిగుబ్బ yes9 TV
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వాతావరణ ఆధారిత బీమా పథకం ( RWBCIS) మరియు *ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)*లో అర్హులైన రైతులు గడువులోగా ప్రీమియం చెల్లించి తప్పనిసరిగా చేరవలిసిందిగా కోరడమైనది.
🌱 వాతావరణ ఆధారిత బీమా పథకం ✅ అర్హత: ఏప్రిల్ 1 – జూలై 15 మధ్య పంట రుణం పొందిన రైతులు. 🌾 పంటలు: వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమోటా. ప్రీమియం చెల్లింపు చివరి తేదీ: జూలై 15
🌾 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ( PMFBY) ✅ పంటలు: వరి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం. వరి పంటకు: ఆగస్టు 15 లోపు మిగతా పంటలకు: జూలై 31 లోపు ప్రీమియం చెల్లించాలి.
🌿 ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఆర్థిక రక్షణ కల్పించే ఈ పథకాలను ప్రతి అర్హ రైతు సద్వినియోగం చేసుకోవాలి.అర్హులైన రైతులు స్వీయ పంట ధ్రువీకరణ పత్రంతో మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేయగలరు.
మండల వ్యవసాయ అధికారి, ముదిగుబ్బ.

Posted Under AP
Editor