రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి..

రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి

ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని శుక్రవారం అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. రక్తదాతలను ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ కుమార్ కార్యదర్శి మహమ్మద్ ఆయుఫ్ లు పూలమాలలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. రక్తదాతలు రక్తదానం చేసేందుకు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో అనీమియా రోజులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి రక్తం కొరత తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా దాతలు దానం చేసిన రక్తం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి గర్భవతులకు అనీమియా రోగుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదాతలు ఇచ్చిన రక్తం ఉపయోగపడుతుందన్నారు.

బైట్స్. ఓ. ఆనంద్, అనంతపురం జిల్లా కలెక్టర్

Posted Under AP
Editor