ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..

* *ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి*

* *ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలకు గ్రౌండ్, కాంపౌండ్ లేకుండా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలి*

*ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉరవకొండ మండల విద్యాధికారి గారికి వినతిపత్రం అందజేత*

*ఉరవకొండ:: నియోజకవర్గం వ్యాప్తంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఉరవకొండ మండల విద్యాధికారి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూన్ మాసంలో 2026- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే వాటిని తుంగలో తొక్కుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యులు మండలం లో ఇప్పటినుంచి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని తెలిపారు.ఇప్పుడే విద్యార్థులను చేర్పిస్తే ఒక ఫీజు జూన్ జూలైలో చేర్పిస్తే మరొక ఫీజు అని తల్లితండ్రులకు మాయమాటలు చెప్పి వేల రూపాయలు ఫీజుల రూపంలో కాజేస్తున్నారన్నారు. ఏవిఆర్,మహేశ్వరి, శ్రీ వివేకానంద,ఉషోదయ,బేతేస్థ,సిద్దేశ్వర,జ్యోతి,శ్రీ వాణి, సాయి ప్రగతి లాంటి ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే అడ్మిషన్లు చేస్తూ వాటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలను అమ్ముతున్నారన్నారు. గ్రౌండ్, కాంపౌండ్ లాంటి కనీస సౌకర్యాలు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించిన సెక్షన్లు కాకుండా అదునపు సెక్షన్లను ఏర్పాటు చేసుకొని గొర్రెల మందల లాగా విద్యార్థులను తరగతి గదులలో సంఖ్యకు మించి డబ్బుల కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. తక్షణమే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న విద్యా సంస్థల పైన , అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల పైన, నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF గా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కోశాధికారి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు రఘు, సిద్ధిక్,నందు తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor