Latest Posts

ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్, సరిహద్దు ఎక్సైజ్ చెక్ పోస్ట్ లు తనిఖీ…

*ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్, సరిహద్దు ఎక్సైజ్ చెక్ పోస్ట్ లు తనిఖీ*

అనంతపురం జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ నాగమద్దయ్య గారు ఈ రోజు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన ఎక్సైజ్ కేసులను, ఎక్సైజ్ రెవెన్యూ రాబడిను సమీక్షించారు. అక్రమ మద్యం, నాటు సారా పైన పటిష్ట నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఉరవకొండ నందు భవానీ బార్ లో ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్స్ తనిఖీ చేయడమైనది. తదుపరి సరిహద్దు ప్రాంతంలో విడపనకళ్ మండలం నందు ఉన్న విడపనకళ్, డొనేకల్ ఎక్సైజ్ చెక్ పోస్టులను తనికి చేసి కర్ణాటక నుండి వచ్చే వాహనాలను పకడ్బందీగా తనిఖీ చేయాలని అక్రమ మద్యం రవాణా ను నిరోధించాలని చెక్ పోస్ట్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర, చెక్పోస్ట్ అధికారులు వీరస్వామి, సుశీలమ్మ లు పాల్గొన్నారు.

– ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఉరవకొండ

Posted Under AP
Editor