సత్యసాయి నీటి పథకం కార్మికుల నిరవధిక దీక్ష: ఆరు నెలల బకాయి జీతాలు చెల్లించాలని సీపీఐ డిమాండ్

సత్యసాయి కార్మికులకు బకాయిపడ్డ ఆరు నెలల జీతాలు వెంటనే చెల్లించి వారి నిరవధిక దీక్షను విరమింప చేసి తక్షణమే మండలంలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టిన తరుణంలో మండలంలోని సత్యసాయి కార్మికులు కూడా తమ విధులను బహిష్కరించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ముదిగుబ్బ దొరిగల్లు రోడ్డు లో ఉన్న పంప్ హౌస్ వద్ద నిరవధిక దీక్షను ప్రారంభించారు, కాగా కార్మికుల చేపట్టిన మొదటి రోజు దీక్షకు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు సంఘీభావం తెలిపి కార్మికులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు, ఎండనకా పగలనకా పనిచేసే నీటి సరఫరా కార్మికులకు వారికొచ్చే అరకొర జీతాలను కూడా నెల నెల ఇవ్వకుండా పెండింగ్ పెడుతుండడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు, ఈ పరిస్థితిలో వారు గత్యంత లేక తమ జీతాలు చెల్లించండి అయ్యా అంటూ తరచూ నిరాహార దీక్షలు చేస్తూ రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు , ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో 36 కోట్ల రూపాయలు సత్యసాయి నీటి పథకం నిర్వహణకు కేటాయించి వాటిలో కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగిందన్నారు, అదేవిధంగా 2026- 27 బడ్జెట్లో ఈ పథకానికి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు, దీన్నిబట్టి చూస్తే సత్యసాయి కార్మికుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందని దుయ్యబట్టారు, ఇప్పటికే మండలంలో ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించకపోవడమే గాక మోటార్ల కాలిపోయిన పైపులు పగిలిపోయిన సంబంధిత అధికారులు సకాలంలో మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకోకపోవడంతో తరచూ తాగునీటి సమస్య ఏర్పడుతోందన్నారు, ముఖ్యంగా మండల కేంద్రంలో ముదిగుబ్బలో నెలకు ఒకసారి కూడా తాగునీటి సరఫరా జరగలేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని సిపిఐ నాయకులు తెలిపారు, ఈ పరిస్థితుల్లో గోరుచుట్టుపై రోకటి పోటులా తిరిగి సత్యసాయి కార్మికులు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తే మండలంలో తాగునీటి సరఫరా రాబోయే రోజుల్లో మరింత దారుణంగా ఉంటుందని శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు, కనుక ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సత్యసాయి కార్మికులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించడంతోపాటు ఈ సత్యసాయి నీటి పథకం నిర్వహణను సత్యసాయి బోర్డు ఆధీనంలోనే యధావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు, లేనిపక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నీటి సరఫరా కార్మికులతో కలిసి ముదిగుబ్బ పట్టణంలో త్వరలోనే పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం చేపట్టి జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు ప్రభుత్వానికి తెలియజేశారు , ఇదిలా ఉండగా మంగళవారం మొదటి రోజు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి కార్మికులు తమకు రావాల్సిన ఆరు నెలల పెండింగ్ జీతాలను చెల్లించడంతోపాటు మిగతా డిమాండ్లను కూడా తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు,

Posted Under AP
Editor