హోలగుందలో నీటి సెగ: ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముట్టడి!

– కర్నూలు జిల్ల హోలగుంద మండలంలో -తాగునీటి కోసం కన్నీరు చేసిన మహిళలు… పంచాయతీ కార్యాలయం ముట్టడి

హోలగుంద న్యూస్…
తాగునీటి సమస్యతో విసిగిపోయిన మహిళలు ఆగ్రహంతో కాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. హోలగుంద మండల కేంద్రంలో గత 15 రోజులుగా తాగునీరు అందకపోవడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి సమీపంలో ఎల్‌ఎల్‌సీ కాలువ ఉన్నప్పటికీ నీరు అందకపోవడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, రాజకీయ నాయకులు సమస్యను పట్టించుకోవడం లేదని మహిళలు విమర్శించారు. మండల కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలి అని మహిళలు అన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వ అలసత్వమా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి వారానికి కనీసం ఒక్కసారైనా నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు…

Posted Under AP
Editor