అరికెర గురుకుల పాఠశాలలో విద్యార్థుల బీభత్సం……

కర్నూలు జిల్లా

ఆలూరు మండలం

అరికెర లో బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మద్యపానం, సిగరెట్లు, మరియు హస్టల్‌లో జరిగిన అలజడుల గురించి విచారణ జరుగుతోంది. ఇది కేవలం ఒక రోజుతో ముగిసేది కాదు, దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నము

ఈ సమస్యల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు , రెవెన్యూ అధికారులు MRO సువర్ణమ్మ ,మరియు mpdo,RI , పాఠశాలను క్రమం తప్పకుండా సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తుంటాము అని తెలిపారు

పాఠశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.

సిబ్బంది అందరికీ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది.

పాఠశాలలో నిబంధనలు కఠినతరం చేస్తూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. అలాగే, రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ తిరగాలని కూడా వారికి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

హాస్టల్ విద్యార్థులు కొందరు, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఆచయ్యతో కలిసి వంట సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లతో దాడి చేయడమే కాకుండా, గ్యాస్ పైపులు తొలగించి, విద్యుత్ లైట్లను పగలగొట్టి బీభత్సం సృష్టించారు.

విద్యార్థుల దాడుల కారణంగా వంట సిబ్బంది భయాందోళనకు గురై ఆ రోజు విద్యార్థులకు భోజనం అందించలేకపోయారు అని వంట సిబ్బంది తెలిపారు

ఈ ఘటనపై వంట సిబ్బంది ఉపాధ్యాయుడు ఆచయ్యపై ఉన్నతాధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.

ఎవరైతే నిషేధిత వస్తువులను దాచి ఉంచి విక్రయిస్తున్నారో, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇతర సిబ్బంది మరియు సెక్యూరిటీని కూడా అప్రమత్తం చేశామని ఆమె తెలిపారు

Posted Under AP
Editor