తాడిమర్రి(yes9tv
మీడియా మిత్రులకు నమస్కారం
తాడిమర్రి కేజీబీవీ పాఠశాలలో 16-04-2026 నుండి 22-04-2026 వరకు ఘనంగా కల్చరల్ & స్పోర్ట్స్ వీక్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కబడ్డీ, వాలీబాల్, టెన్నికోయిట్, షాట్‌పుట్ వంటి క్రీడల్లో జూనియర్ మరియు సీనియర్ విభాగాలలో పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MEO-1 శ్రీ కృష్ణమోహన్ గారు, MEO-2 శ్రీ వెంకటేష్ గారు హాజరై విజేతలకు షీల్డ్స్ అందజేశారు. స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది.
అలాగే ఇంటర్మీడియట్ బైపీసీ ఫలితాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కాలేజీ టాపర్స్‌గా నిలిచిన B. శ్రావ్య, D. దుర్గేశ్వరి విద్యార్థినులను షీల్డ్స్ మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. రెండవ సంవత్సరం టాపర్ B. శ్రావ్యకు ప్రిన్సిపాల్ A. వాణిశ్రీ గారు రూ.1000 నగదు బహుమతి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా MEO-1, MEO-2 గారు విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించి కేజీబీవీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు
తాడిమర్రి కేజీబీవీలో ఘనంగా కల్చరల్ & స్పోర్ట్స్ వీక్ – విజేతలకు బహుమతులు.
