ముదిగుబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: పదో తరగతి విద్యార్థి మృతి

అతివేగంతో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల గోపేపల్లి గ్రామానికి చెందిన హైదర్ భాష (16) మృతి ముదిగుబ్బ వద్ద దొరిగల్లు క్వార్టర్స్ సమీపంలో బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదర్ భాష (16) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు, నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన హైదర్ భాష ముదిగుబ్బ మండలంలోని ఇందుకూరు గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రులను చూడ్డానికి బుధవారం సాయంత్రం ముదిగుబ్బ వైపు నుంచి తన ద్విచక్ర వాహనంలో ఇందుకూరు గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో దొరిగల్లు క్వాటర్స్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఐస్ బండిని ఢీకొనడం తో
ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది,
ఈ సంఘటనలో
ఆ బాలుడి గొంతుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం, కాగా మృతుడు హైదర్ బాషా ఇటీవలే పదవ తరగతి పరీక్షలు రాసినట్లు తెలిసింది, ఈ విషయం తెలిసిన వెంటనే ముదిగుబ్బ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి అనంతరం కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరికి తరలించారు

Posted Under AP
Editor