ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల వల్ల టెక్ ఇండస్ట్రీలో కొత్తగా నియామకాలు చేపట్టే అవకాశాలే కనిపించడం లేదు. నిజానికి ఉన్న ఉద్యోగులనే టెక్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. కరోనా తర్వాత టెక్నాలజీపై ఆధారపడే ప్రజల సంఖ్య పెరిగింది కానీ ఇప్పుడా సంఖ్య మళ్లీ తగ్గింది. దానికి తోడు ఆర్థిక మాంద్యం వల్ల టెక్ దిగ్గజాలు (Tech Companies) ఖర్చులు తగ్గించుకునేందుకు తమ నియామక ప్రణాళికలను ఆపేయడంతో పాటు సిబ్బందిని తొలగిస్తున్నాయి. కరోనా తర్వాత మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యాయి.
ట్విట్టర్ వంటి సంస్థలు ఆల్రెడీ భారీగా ఉద్యోగులను తొలగించాయి. కోవిడ్ తరువాత, ఏ కంపెనీలు ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించాయి, లేఆఫ్స్ ఇవ్వాలని నిర్ణయించిన సంస్థలేవో తెలుసుకుందాం. మెటా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తమ సిబ్బందిలోని సుమారు 13 శాతం వర్క్‌ఫోర్స్‌ని తగ్గించాలని నిర్ణయించింది. అంటే 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కంపెనీ తీసేయనుంది. ఆశించిన స్థాయిలో ఆదాయాలు రాకపోవడం.. రాబడి తగ్గుదల వల్ల మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా లేఆఫ్స్ ఉంటాయని ప్రకటించింది. 2004లో ఫేస్‌బుక్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీ ఉద్యోగుల తొలగింపులు ఎప్పుడూ నమోదు కాలేదు.
కాగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు నియామక ప్రక్రియను కూడా ఆపేస్తున్నట్లు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ రీసెంట్‌గా ప్రకటించారు.హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు… మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చండి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే సీఈఓ పరాగ్ అగర్వాల్, CFO నెడ్ సెగల్, న్యాయ వ్యవహారాలు, పాలసీ చీఫ్ విజయ గద్దెను తొలగించారు. ఆ తర్వాత 7,500 మంది వర్క్‌ఫోర్స్‌లో దాదాపు సగం మంది సిబ్బందిని తొలగించారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్ బృందాల నుంచి 90 శాతం భారత ఉద్యోగులు కూడా మస్క్ వచ్చాకే జాబ్ కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ పీసీ అమ్మకాలు భారీగా తగ్గడంతో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ తన వర్క్‌ఫోర్స్‌ని తగ్గించాలని నిర్ణయించుకుంది.
ఈ టెక్ కంపెనీ జులైలో తన ఉద్యోగులలో 1 శాతం మందిని తొలగించింది. గత నెలలో కంపెనీ తన సిబ్బందిని మరింత తగ్గించుకోవలసి వచ్చింది. దీనికి ముఖ్య కారణం మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ విభాగంలో మందగమనం ఏర్పడటమే. BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది వేలిడిటీతో కొత్త ప్లాన్… బెనిఫిట్స్ తెలుసుకోండి అన్‌అకాడమీ ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీ ఖర్చులను తగ్గించుకోవడానికి… లాభదాయకతను పెంచడానికి 350 మంది ఉద్యోగులను లేదా మొత్తం 3,500 మంది ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించింది. ఏప్రిల్‌లో కూడా లాభదాయకతపై దృష్టి పెట్టడానికి.. ఖర్చులను తగ్గించడానికి అనాకాడెమీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది.
జులైలో లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని, రెండేళ్లలో పబ్లిక్‌గా వెళ్లాలనే లక్ష్యంతో అన్‌అకాడమీ వ్యవస్థాపకులు ఉద్యోగుల జీతంలో కోత విధించారు. బైజూస్ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ దాదాపు 2,500 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. తమ కంపెనీలో ఒకే రోల్ చేపట్టే ఉద్యోగులు డబుల్ ఉన్నారని.. వారితో తమకు అవసరం లేదన్నట్లు కంపెనీ లేఆఫ్స్ సమర్థించింది. కాగా సవాళ్లతో కూడిన నిధుల వాతావరణంలో కంపెనీ ఖర్చు తగ్గించేందుకు తొలగింపులు చేపట్టి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.