విశాఖ
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..
మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో విషాదం..
8 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం..
పలువురికి గాయాలు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథ మిక సమాచారం. ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుండగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదం అనంతరం భారీగా మంటలు చెలరేగ డంతో వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనతో కార్మికులు, ఉద్యో గులు భయాందోళనలకు గురై బయటకు పరు గులు తీశారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టగా, ప్రమాదానికి గల కారణాలపై విచార ణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
