శ్రీకాకుళంలో పంచాయతీరాజ్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం: గ్రామ పంచాయతీల బలోపేతమే లక్ష్యంగా కీలక తీర్మానాలు!

తాడిమర్రి (yes9tv )శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం
గ్రామ పంచాయతీల బలోపేతం, స్థానిక సంస్థల అభివృద్ధిపై కీలక తీర్మానాలు
శ్రీకాకుళం జిల్లాలోని ఎస్.వి.ఏ గ్రాండ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఎలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక సంస్థల హక్కులు, నిధుల కేటాయింపు, ప్రజాసేవల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ, నాయకులు బిర్రు ప్రతాప్ రెడ్డి, రాజు, తెలంగాణ రాష్ట్రం నుంచి నరేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో గ్రామ పంచాయతీలకు అధిక ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడం, సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక సంస్థల పాత్రను మరింత బలోపేతం చేయడం వంటి పలు ముఖ్యమైన అజెండాలపై తీర్మానాలు ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యులు ఇస్మాయిల్ అజాద్, గోనుగుంట్ల భూషణ్ నాయుడుతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం ప్రతినిధులు, పంచాయతీరాజ్ ఛాంబర్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor