నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం
– ఈరోజు నంద్యాల పట్టణంలో నిర్వహించిన నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు.
– ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అభివృద్ధి కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో జిల్లా సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.
– ఈ కార్యక్రమంలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు బి.సి. జనార్దన్ రెడ్డి గారు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మహమ్మద్ ఫరూఖ్ గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గారు, జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
