Latest Posts

తాడిమర్రి మండలంలో పెట్రోల్ బంక్ నిర్వాకం – వాహనదారుల ఆగ్రహం.

తాడిమర్రి (yes9tv)
తాడిమరి మండలంలో పెట్రోల్, డీజిల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలం మొత్తం కోసం ఒకే ఒక్క పెట్రోల్ బంక్ ఉండగా, అందులో ఇంధనం నిల్వలో ఉన్నప్పటికీ వినియోగదారులకు సరఫరా చేయడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అత్యవసర అవసరాల కోసం వచ్చిన ప్రజలు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలోనే బంక్ యాజమాన్యం కావాలనే ఇంధనాన్ని నిల్వ ఉంచి విక్రయించడం లేదని వాహనదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యగా వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఆయా బంక్‌లలో ఉన్న ఇంధన నిల్వలను పరిశీలించి, స్టాక్ ఉన్నప్పటికీ విక్రయం చేయని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు నిరంతరంగా ఇంధనం అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Posted Under AP
Editor