నిడిగళ్ళులో మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షణ – బీజేపీ నాయకుల పాల్గొనిక..

తాడిమర్రి(yes9tv)

ఆదివారం ధర్మవరం శాసనసభ్యులు మరియు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 133వ మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమాన్ని నిడిగళ్ళు గ్రామంలో వీక్షించారు. తాడిమర్రి మండలం కిసాన్ మోర్చా అధ్యక్షులు జి. వెంకట నాయుడు గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం ఆయన స్వగృహంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు న్యూక్లియర్ మరియు పవన విద్యుత్, రైతుల సంక్షేమం, దేశ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వారిలో ధర్మవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంకా నాగార్జున, తాడిమర్రి మండలం సింగిల్ విండో డైరెక్టర్ అనుగుత్తి రమణ, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి నిడిగిల్లు వాల్మీకి రామాంజనేయులు, బత్తల వీర రాఘవ, నార్సింపల్లి గొంది రవి, అగ్రహారం స్కూల్ చైర్మన్ నీరు గుట్టు నాగార్జున, అగ్రహారం చెరువు ఆయకట్టు చైర్మన్ బాటన్న గారి లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor