తాడిమర్రిలో పోషణ పక్వాడా కార్యక్రమం విస్తృతంగా నిర్వహణ..

తాడిమర్రి(yes9tv)
గర్భవతులు, బాలింతలు తీసుకునే ఆహారంపైనే పిల్లల ఆరోగ్యం ఆధారపడుతుందని ఐసీడీఎస్ సీడీపీఓ సరస్వతి పేర్కొన్నారు. కురబ కాలనీలోని గంగమ్మ గుడి వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన గర్భవతులు, చిన్నపిల్లల తల్లులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, జింక్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
సూపర్వైజర్లు లలితమ్మ, దేవమణి, చంద్రమ్మ మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పోషణ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు, బరువు కొలతలు, హిమోగ్లోబిన్ స్థాయిలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ, పిల్లలకు సమతుల ఆహారం, శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. చేతులు కడుక్కోవడం, స్వచ్ఛమైన నీరు తాగడం వంటి అలవాట్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో అవసరమని వివరించారు.
మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు పిల్లలకు ఆటల ఆధారిత విద్య ఎంతో ముఖ్యమని, ఈ దశలో వారి మెదడు చురుకుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పోషకాహార ప్రదర్శనలు, వంటకాల డెమో, ఆరోగ్య చిట్కాలు, తల్లి-శిశు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అదనంగా, గర్భిణులు మరియు బాలింతలకు ఉచిత సప్లిమెంట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులు, గర్భవతులు, బాలింతలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

Posted Under AP
Editor