ఈరోజు పత్తికొండలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు కరణం నరేష్ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మన దేశ గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పత్తికొండలోని నాలుగు స్తంభాలు వద్ద ఖర్గే గారి చిత్రపటాన్ని దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి బ్రహ్మయ్య మాట్లాడుతూ:
👉 దేశ ప్రధానిని ఉగ్రవాదులతో పోల్చడం అత్యంత దురదృష్టకరం మరియు ఖండనీయమని తెలిపారు.
👉 ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యలని అన్నారు.
👉 కాంగ్రెస్ పార్టీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
👉 బీజేపీ ఎప్పటికప్పుడు దేశ గౌరవాన్ని కాపాడటానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండి మల్లికార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోవర్ధన్ నాయుడు, ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, అసెంబ్లీ లీగల్ సిల్క్ కన్వీనర్ అడ్వకేట్ నాగేష్ , మండల ప్రధాన కార్యదర్శి మాలేకర్ వీరేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రవీంద్ర, పందుకోన గోపాల్, ఓబిసి మండల ప్రధాన కార్యదర్శి భగవాన్ రావు, గోరంట్ల కరణం చంద్రన్న
మోదీపై దుర్భాషలు: ఖర్గే చిత్రపటం దహనం చేసిన పత్తికొండ బీజేపీ నాయకులు
