ముదిగుబ్బ యస్ 9
దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం సిగ్గుచేటు
ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డ భారతి జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు
అమరావతి, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదితో పోల్చడం సిగ్గు చేటని బీజేపీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు పత్రిక విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో విలువలు, సంస్కారం, బాధ్యతా యుత వైఖరి మరిచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రిపై తీవ్రవాది అని చేసిన వ్యాఖ్యలు హేయ మన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ ప్రజా స్వామ్యంలో భావ భేదాలు సహజమే అయిన ప్పటికీ, వ్యక్తిగత దూషణలుతో రాజకీయ సంస్కృతిని కాంగ్రెస్ దిగజార్చిం దన్నారు. దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తిపై అవమానకర పదజాలం ఉపయోగించడం బాధ్యతా యుత రాజకీయాలకు విరుద్ధమని అదే విధంగా దేశ ప్రజలకు కార్గే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ సోషల్ మీడియా కన్వీనర్ పీవీ శివకుమార్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేశ నారాయణ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ గంగులప్ప నాయకులు పాల్గొన్నారు
