Yes. 9tv
యాడికి మండల కేంద్రంలోని కోట వీధిలో నివాసం ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కంబాలూరు రామేశ్వరయ్య అనే బ్రాహ్మణుడు శుక్రవారం రాత్రి చనిపోవడం జరిగింది.శనివారం నాడు అంత్యక్రియలకు యాడికి ఆర్యవైశ్య సంఘంలో కొంతమంది సభ్యులు దాదాపుగా 12 వేల రూపాయలు చందాలు వేసుకుని సహకరించడం జరిగింది. చందాలు వేసుకున్న వారిలో కండే పాండురంగయ్య, గంగవరం చంద్రయ్య, మద్దాల నారాయణస్వామి, నిచ్చెనమెట్ల ప్రదీపు, శేఖర్, బచ్చు సుబ్రహ్మణ్యం, గోపి, రంగయ్య,మంజునాథ్, రవ్వ రాము, మారుతి, ప్రసాదు, హరి, పవన్, వీరందరు ధన సహాయం చేయడం జరిగింది. బంగారు బాల, గంగవరం శ్రీధర్, శేఖర్ తదితరులు దగ్గరుండి అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించారు. యాడికి బ్రాహ్మణ సంఘ సభ్యులు చెన్నకేశవ స్వామి ప్రధానార్చకులు హరి స్వామి పదివేల రూపాయలు అంత్యక్రియల ఖర్చుల కింద మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది.అలాగే మే ఐ హెల్ప్ యు హెల్ప్ ఫౌండేషన్ మరియు వేడుకాపుర ఫౌండేషన్ యాడికి వారు ఆధ్వర్యంలో పది మంది వాలంటీర్లుగా వచ్చి ఈ అంత్యక్రియలు కార్యక్రమాన్ని నిర్వహించారు…