బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, పూర్తిగా బ్రేక్ కాదులేండి.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.
తాను రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజకీయ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, తాను పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్సవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చమత్కరించారు.
ఈ ట్వీట్‌కు ఓ స్మయిలింగ్ ఎమోజీని కూడా జోడించారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తమదైనశైలిలో స్పందిస్తున్నాయి.