మంచం కోసం కొట్టుకున్న భార్యభర్తలు..చివరకు ఏమైందంటే?

ఇద్దరు భార్యాభర్తలు.. గొడవలతో ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. ఒకరి వస్తువులు ఒకరు పంచుకున్నారు. ఇంట్లోనే ఎవరి సంసారం వారు చేస్తున్నారు. విడాకులు ఇవ్వమంటే భర్త ఇవ్వడం లేదు. నేను పోతానన్న ససేమిరా అంటున్నాడు. దీంతో ఆ భర్తతో వేగలేక చచ్చి చెడీ ఆ ఇంట్లోనే వేర్వేరుగా ఉంటోంది భార్య. తాజాగా ఈ దంపతుల మధ్య మంచం విషయంలో గొడవ చిలికి చిలికి చాట అంతైంది. భార్య చెవ్వు గూబ పగిలిపోయింది. అర్ధరాత్రి 1 గంటకు వచ్చిన భర్తకు మంచం ఇచ్చేందుకు నిరాకరించిన భార్యపై కోపంతో రెచ్చిపోయాడు భర్త. మహారాష్ట్రలోని బొరివ్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వైరల్ గా మారింది. బొరివ్లి ఏరియా రాంబాగ్ లేన్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో దంపతులు నివసిస్తున్నారు.

.కొన్నేళ్ల క్రితం పెళ్లైన వీరి మధ్య రెండేళ్ల నుంచి గొడవలు ముదిరిపోయాయి. విడాకులు ఇవ్వాలని 2022 ఏప్రిల్‌లో భార్య కోరినా భర్త ఇవ్వకుండా కలిసి ఉందాం అంటూ సతాయిస్తున్నాడు. అయితే ఒకే ఇంట్లో ఉంటున్నా వీరిద్దరూ ఎవరి వస్తువులను వారు పంచుకొని విడిగానే ఉంటూ పడుకుంటున్నారు. ఒకరు ఒక సమయంలో వినియోగించిన వస్తువును మరొకరు వినియోగించరాదనే కండీషన్ పెట్టుకున్నారు. శనివారం రాత్రి భార్య మంచంపై నిద్రిస్తోంది. రాత్రి ఒంటి గంట సమయంలో భర్త మంచం వద్దకు వచ్చాడు. తాను విశ్రాంతి తీసుకోవాలని.. మంచం ఇవ్వాలని భార్యను డిమాండ్ చేశాడు. ఆమె మంచం ఇవ్వకపోవడంతో.. చెవిపై తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి, వినికిడి కోల్పోయింది. తన స్నేహితురాలి సాయంతో బాధితురాలు బొరివ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెవి పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు నిర్ధారించారు. ఇలా కేవలం మంచం కోసం జరిగిన ఫైట్ చివరకు ఆ భార్య చెవి గూబ బద్దలయ్యే వరకూ సాగింది.

YES9 TV