Latest Posts

ముదిగుబ్బ లో ఘనంగా వైద్య సిబ్బంది హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ముదిగుబ్బ yes9 TV

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు “హర్ ఘర్ తిరంగా “కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల తో ముదిగుబ్బ మండల కేంద్రంలో వైద్య సిబ్బంది జాతీయ జెండాలతో ఘనంగా ర్యాలీ చేపట్టారు. ముదిగుబ్బ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాజేంద్ర మరియు సిబ్బంది పాల్గొని బస్టాండ్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్ర మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన ప్రజలే ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించగలరని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది జాతీయ పతాక గౌరవం మరియు దేశభక్తి నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. సరస్వతమ్మ, ఎం పి హెచ్ ఈ ఓ మగ్బూల్, పీహెచ్ఎన్.లలితమ్మ, సూపర్వైజర్ పార్వతమ్మ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Posted Under AP
Editor