ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామ పరిధిలోని చెరువు నందు ఈరోజు పిఎండిఎస్ విధానం ద్వారా సామూహిక పశుగ్రాసాల సాగును ప్రారంభించడం జరిగింది. ఇందులో పశుగ్రాసానికి అనువైనటువంటి పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందజేయబడినటువంటి గడ్డి జాతి జొన్నలు (సి ఎస్ హెచ్ 24 ఎం ఎఫ్) ఆఫ్రికన్ కాల్ జాతి మొక్కజొన్న, అనుములు, అలసందలు, కందులు ,సజ్జలు పిఎండిఎస్ విధానంలో విత్తన గుళికల కింద మార్చి నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా చెరువులో విత్తడం జరిగింది… ఈ సాగుకు అవసరమయ్యే విత్తనాలను పశుసంవర్ధక శాఖ ఉచితంగా సరఫరా చేయగాలిగారు…ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండలం యంపిపి ఆదినారాయణ యాదవ్ మండల స్థాయి కన్వీనర్లు, కూటమి నాయకులు, ధర్మవరం పశు సంవర్ధక శాఖ ఉపసంచాలకులు, ధర్మవరం ఏరియా పశువైద్యశాల సహాయసంచాలకులు, ముదిగుబ్బ మండల ఎంపీడీవో, ఏపీవో మరియు సిబ్బంది, ధర్మవరం మండలం పశువైద్యులు, ముదిగుబ్బ మండలం పశువైద్యాధికారి, పశుసంవర్ధక శాఖ సహాయకులు మరియు ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది, మంగళమడక పంచాయతీ సెక్రటరీ మరియు స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామస్థాయి కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు….
సూపర్ ఎల్నినో దృష్ట్యా మంగళ మడక చెరువులో సామూహిక పశుగ్రాసాల సాగు కార్యక్రమం
