Latest Posts

కళ్యాణదుర్గంలో విద్యార్థులకు ‘ప్రేమతో సైకిళ్లు’: రూ.5 కోట్ల ఖర్చుతో 7,300 సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు!

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం

బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులకు 7300 సైకిళ్లు 5 కోట్ల వ్యయంతో పిల్లలకు ప్రేమతో సైకిళ్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు.

గత గొడ్డలి పార్టీ మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి గరిట, జగ్గు, గుడ్డుపైన కూడా తన పేరు, బొమ్మతో నీచ రాజకీయం చేశాడు విద్యార్థులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం నాకు దక్కిందని ఎమ్మెల్యే తెలిపారు

విద్యార్థులు బ్యాగులు మోసుకుని నడుచుకుంటూ వెలుతుంటేచూసి బాధ కలిగి నేడు సైకిళ్లు అందిస్తున్నాం
వైసీపీ ప్రభుత్వంలో విద్యావ్యవస్థను నాశనం చేశారు.

విద్యార్థులు అందరికి అమ్మవడి అని ఒక్కరికి ఇచ్చి నమ్మక ద్రోహం చేశాడు కూటమి ప్రభత్వం చెప్పిన విధంగా ఒక ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అందరికీ తల్లికివందనం అందిస్తున్నాం

వైసీపీ ప్రభుత్వం అమ్మవడి 5500 కోట్లు ఇస్తే కూటమి ప్రభుత్వం తల్లికివందనం 10,190 కోట్లు అందించింది అంగన్వాడీ టీచర్లకు కూడా తల్లికివందన 30,000 మంది ఇచ్చామని తెలియజేశారు.

ఎస్సార్సీ సంస్థ తరుపున ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు 5కోట్ల రూపాయల ఖర్చుతో 7300 సైకిళ్లు పంపిణీ చేశారు

Posted Under AP
Editor