ముదిగుబ్బ yes9 tv
ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు” రెండేళ్ల సుపరిపాలన -అభివృద్ధి మరియు సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ ‘ అనే కార్యక్రమాన్ని ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామ పంచాయితీలోని 82,83,84,85 వ బూతులను విజయవంతంగా నిర్వహించాము. “ప్రజల ఇంటి వద్దకే పరిపాలన ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం -ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం”… మలక వేముల గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున తెలిపారు. ప్రతి బూతులలో ‘రెండేళ్ల సుపరిపాలన అభివృద్ధి మరియు సంక్షేమ విషయాలు ప్రతి గ్రామపంచాయతీలోని బూత్ కన్వీనర్లు అందరు పూర్తి చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం పరిపాలన చేపట్టిన వెంటనే నిరుద్యోగులకు డీఎస్సీ, రైతులకు అన్నదాత సుఖీభవ 20 వేలకు పెంచుతూ విడతల వారీగా చెల్లిస్తున్నారు. ప్రతి కుటుంబానికి వంటగ్యాస్ ఉచితంగా గ్యాస్ సబ్సిడీ ప్రభుత్వం అందిస్తోంది. స్త్రీలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్న వారందరికీ 13 వేల రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూటమి ప్రభుత్వం పార్టీలకతీతంగా అందిస్తుందని బండి మల్లికార్జున తెలిపారు. కార్యక్రమంలో బండి మల్లికార్జున, మాదాసు హేమంత్ కుమార్, సన్నిపిరాళ్ల సాయినాథ బాబు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు
ముదిగుబ్బ మండలం మొలకవేముల లో డోర్ టూ డోర్ కార్యక్రమం..
