మోదీ సుపరిపాలనకు 12 ఏళ్లు – తాడిమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు

తాడిమర్రి( yes9tv )మోదీ సుపరిపాలనకు 12 ఏళ్లు – తాడిమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు
తాడిమర్రి, జూన్ 10: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడిమర్రి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడిమర్రి శివాలయం పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసి స్వచ్ఛత కార్యక్రమం చేపట్టడంతో పాటు గ్రీన్ అంబాసిడర్లకు చీరలు పంపిణీ చేశారు.
అనంతరం శివాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశాభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలులో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.
మండల కన్వీనర్ దేవర రాము మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై విశేష గుర్తింపు సాధించిందని అన్నారు. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పన వంటి అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
దేవర రాము పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుండి పనిచేస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేవర రామ్మోహన్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోతులయ్య, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు గోవిందప్ప, జిల్లా కిసాన్ మోర్చా సభ్యుడు చంద్ర, సీనియర్ నాయకులు కదిరప్ప, నారాయణస్వామి, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor