తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు

*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు*

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు గారు దర్శించుకున్నారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి గారితో కలిసి ఉదయం బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి శుభఫలితాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనానంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూల నాగరాజు గారు పేర్కొన్నారు.

Posted Under AP
Editor