ముగిసిన ఉపాధ్యాయుల జ్ఞాన ప్రకాష్ శిక్షణ కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలలలో ఒకటి మరియు రెండు తరగతులను బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఆరు రోజులపాటు జరుగుతున్న జ్ఞాన ప్రకాష్ ఇయర్ 3 శిక్షణా కార్యక్రమం ముగిసింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనంతపురం తాడిపత్రి గుత్తి ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం పట్టణాలలో మొత్తం ఎనిమిది కేంద్రాలలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగాయి
గత రెండు సంవత్సరాలుగా జ్ఞాన ప్రకాష్ ఎయిర్ 1 మరియు ఇయర్ 2 శిక్షణ కార్యక్రమాల ద్వారా ఒకటి రెండు తరగతుల బోధిస్తున్న ఉపాధ్యాయులకు పునాది స్థాయిలో విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన సామర్ధ్యాలు మెరుగుపరచుట అనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఇయర్ 3 శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది
ఈ శిక్షణ కార్యక్రమంలో జాతీయ విద్యా విధానం NEP 2020, జాతీయ పాఠ్యాచరణ చట్రం NCF నిపున్ భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను ఉపాధ్యాయులకు వివరించారు అలాగే పాఠ్య సంస్కరణలు అభ్యసన ఫలితాల ఆధారిత బోధన మరియు రెడినెస్ కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది తెలుగు ఆంగ్లము విభాగాలలో తరగతి గది అంచనా పద్ధతులను వివరించారు గణిత విభాగంలో గణిత ఆటల ద్వారా బోధించు వినూత్న పద్ధతులను ప్రదర్శించారు TLM సమర్థ వినియోగంపై చర్చ నిర్వహించారు
స్థానిక బుక్కరాయసముద్రంలోని విజయభారతి కాలేజీలో ముగింపు సమావేశం
ఈ ముగింపు సమావేశానికి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీనివాస రావు గారు గుత్తి డివిజన్ డిప్యూటీ డిఈఓ శ్రీ లక్ష్మన్న గారు విచ్చేసారు
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీనివాస రావు గారు శిక్షణ తీసుకుంటున్న ఉపాధ్యాయుల తో మాట్లాడుతూ ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు పునాది స్థాయిలోని సామర్ధ్యాలు పంపించడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని శిక్షణలో అనేక అంశాలను తెలుసుకొని, తెలుసుకున్న అంశాలను పాఠశాలలో విద్యార్థుల బోధనలో ఉపయోగించాలని తెలియజేశారు
అలాగే గుత్తి డివిజన్ డిప్యూటీ డిఈఓ శ్రీ లక్ష్మణ్ సార్ గారు మాట్లాడుతూ టీచర్లు విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలని తన బోధన ద్వారా పిల్లల మనసులో చిరుస్థాయిగా నిలిచే అవకాశం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని తెలియజేశారు
సమగ్ర శిక్ష A M O వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి 8 మంది కీ రిసోర్స్ పర్సన్స్, టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి 93 మంది జిల్లా రిసోర్స్ పర్సన్స్ నియమించామని. ఈ శిక్షణ కార్యక్రమంలో1458 మంది ఒకటి రెండు తరగతులు బోధిస్తున్న టీచర్లు శిక్షణ తీసుకున్నారని తెలియజేశారు
ఏపీ మోడల్ స్కూల్ రాప్తాడు నందు ముగింపు సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసి శ్రీమతి టి శైలజ గారు పాల్గొన్నారు ఏపీసి మేడం గారు మాట్లాడుతూ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జి ఎఫ్ ఎల్ ఎన్ అనే పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి కచ్చితంగా భాషలోనూ మరియు గణితంలోనూ ప్రాథమిక అంశాలు సాధించి తీరాలని తపనతో ఉన్నారు ఈ లక్ష్యం నెరవేరాలంటే టీచర్లతోనే సాధ్యమవుతుందని కావున టీచర్లందరూ నిబద్ధతతో విద్యార్థులలో సామర్థ్యాలను పెంపొందించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంచేలా కృషి చేయాలని తెలియచే
ఈ ముగింపు సమావేశంలో అసిస్టెంట్ ఏ ఎం ఓ లు ఫణి రాజ్ నారాయణస్వామి కె.ఆర్.పిలు డిఆర్పిలు పాల్గొనడం జరిగింది
