నల్లమాడలో బీజేపీ సంబరాలు: ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్!**

భారత ప్రధానిగా అత్యధిక రోజులు పరిపాలన చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోడీ గారు

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో సచివాలయం-1 ఆవరణములో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలన 4399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో ఈ కాలాన్ని “మోదీ యుగం”గా ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి, తన కృషి, అంకితభావం మరియు దేశభక్తితో దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన శ్రీ నరేంద్ర మోదీ గారు నేడు ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా విశిష్టమైన రికార్డులను నెలకొల్పారని అన్నారు.

గత 12 సంవత్సరాలుగా దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ భద్రత వంటి అనేక రంగాల్లో మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక విజయాలను సాధించిందని ఆయన వివరించారు. భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచ దేశాల ముందు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారేనని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కౌలు రైతుల రాష్ట్ర కో-కన్వీనర్ ఎస్. హనుమంత రెడ్డి జిల్లా కార్యదర్ రమేశ్, తోలేటి దేవేందర్ రెడ్డి, బుట్టి నాగభూషణం నాయుడు, యనముల సాయినాథ్ రెడ్డి,బీజేవైఎం అమ్మడుగూరు మండల అధ్యక్షుడు హరీష్ కుమార్, మహేష్ , ఓంకార రెడీ, ఆక్కులప్ప నాయక్, సాయి, కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Posted Under AP
Editor