అనంతపురం జిల్లా, రాయదుర్గం.
గవి సిద్ధేశ్వర స్టీల్స్ పరిశ్రమను పరిశీలించిన జిల్లా కలెక్టర్
రాయదుర్గం, జూన్ 5: రాయదుర్గం మండలంలోని బి.ఎన్.హళ్లి గ్రామం సమీపంలో ఉన్న గవి సిద్ధేశ్వర స్టీల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు.
సుమారు 22.26 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ పరిశ్రమలో జరుగుతున్న కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా ఆరా తీశారు. పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను, అనుమతులు, నిర్వహణ విధానం, కాలుష్య నియంత్రణ చర్యల గురించి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) అధికారులు మరియు పరిశ్రమ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు.
పరిశీలన సందర్భంగా పరిశ్రమ నిర్వహణ, పర్యావరణ ప్రమాణాల అమలు, భద్రతా చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఏపీపీసీబీ పర్యావరణ ఇంజనీర్ ఎం. శశికళ, తహసీల్దార్ సూర్య ప్రతాప్, పరిశ్రమ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
