Latest Posts

“రెడ్డిపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి”

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో తిరుపతి రమాదేవి హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజువారీ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరానికి వచ్చిన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor