అనంతపురం జిల్లా రాయదుర్గం
జగన్ ప్రభుత్వం చంద్రబాబునాయుడుపై పెట్టిన రాజకీయ కుట్రపూరిత కేసులు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయని, అయితే, తనపై ఉన్న సీబీఐ కేసులపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాయదుర్గంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఆయన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలకోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేయకపోతే..? సీబీఐ కోర్టు విచారణలకు ఎందుకు హాజరు కావడం లేదు? పదేపదే ఎందుకు వాయిదాలు కోరుతున్నారని కాలవ సూటిగా ప్రశ్నించారు. కోర్టు వాయిదాలకు ఏళ్ళ తరబడి డుమ్మా కొడుతున్న జగన్ ఎంతకాలం తప్పించుకు తిరుగుతారన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై నమోదైన కేసుల్లో విచారణను ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ కోర్టులకు మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. నిష్ట, నిబద్ధత, పారదర్శకతతో ప్రజాసేవ చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే రాజకీయ కక్షతో నాటి వైసీపీ ప్రభుత్వం వరుసగా అక్రమ కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. నిష్కళంక రాజకీయ జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడుపై నిరాధార ఆరోపణలు చేయడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడుపై మోపిన కుట్రపూరిత కేసులు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయన్నారు. ఇటీవల అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడు నిజాయితీకి అద్దం పట్టిందని కాలవ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం ఏమాత్రం లేదని, అది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో వేసిన కేసేనని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. రాజకీయ కక్షసాధింపునకు చట్టాలను ఆయుధంగా ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకత్వానికి గట్టి హెచ్చరిక అని అన్నారు.
2019-2024 మధ్య చంద్రబాబు నాయుడుపై మొత్తం 22 కేసులు నమోదు చేశారని, అందులో 8 కేసులు సీఐడీ ద్వారా రాజకీయ దురుద్దేశంతో పెట్టించారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్‌మెంట్, ఉచిత ఇసుక విధానం వంటి అనేక అంశాల్లో నమోదైన కేసులు న్యాయస్థానాల ముందు నిలవలేకపోయాయని చెప్పారు. లోకేష్, మంత్రి నారాయణపై కూడా ఇదే విధంగా రాజకీయ కక్షతో కేసులు బనాయించారని విమర్శించారు. నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీయాలని వైసీపీ దుర్మార్గులు చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. కోర్టుతీర్పులు వైసీపీ నాయకత్వానికి గట్టి చెంపపెట్టని, సత్యం చివరికి గెలుస్తుందనే విషయాన్ని న్యాయస్థానాలు మరోసారి నిరూపించాయన్నారు. జగన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల్లో అతను ఎప్పుడు విచారణను ఎదుర్కొంటారని నిలదీశారు. ప్రజలకు దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్
