నల్లమాడలో ‘ఒక నెల – ఒక్క నియోజకవర్గం – నాలుగు పర్యటనలు’.. క్షేత్రస్థాయిలోనే 42 అర్జీల తక్షణ పరిష్కారం!

నల్లమాడలో ‘ఒక నెల ఒక్క నియోజకవర్గం నాలుగు పర్యటనలు, కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల కేంద్రంలో ఈ రోజు మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించడం జరిగింది
ప్రజా ఫిర్యాదుల సత్వర, సక్రమ పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఒక నెల – ఒక్క నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” వ్యవస్థీకృత రెండవ పర్యటన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి ఆర్డీఓ మరియు నల్లమాడ తహసీల్దార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మొదటి సభలో వచ్చిన 77 అర్జీలకు గాను, అధికారులు తక్షణమే స్పందించి 42 అర్జీలను పరిష్కరించి, సదరు లబ్ధిదారులకు పరిష్కార పత్రాలను అందజేశారు.
రహదారి సమస్య- వెళ్ళమద్ది గ్రామ పరిధిలోని ఎర్రవంకపల్లి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న రాస్తా సమస్యను పరిష్కరించారు.

శ్మశాన వాటిక భూమి- దొన్నికోట గ్రామ పరిధిలోని బొగ్గలపల్లి గ్రామంలో శ్మశాన వాటిక కొరకు అవసరమైన భూమిని కేటాయించారు.

భూ వివాదాల పరిష్కారం- కురుమాల గ్రామ పొలంలో సుమారు 150 ఎకరాల భూమి డిస్ప్యూట్ రిజిస్టర్‌లో ఉండటంతో రైతులు ఇబ్బందులు పడేవారు. రైతులకు న్యాయం చేకూరుస్తూ ఆ భూమిని డిస్ప్యూట్ రిజిస్టర్ నుండి పూర్తిగా తొలగించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, ఈ పర్యటనల ద్వారా క్షేత్రస్థాయిలోనే అర్జీలను పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, ఆర్డిఓ సువర్ణ,తహసీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల మండల అధికారులు, గ్రామస్థులు, రైతులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor