Latest Posts

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని రాయదుర్గానికి చెందిన కార్పెంటర్ రిజ్వాన్ అక్కడికక్కడే మృతి

అనంతపురం జిల్లా , రాయదుర్గం.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం 75 వీరాపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి చెందిన రిజ్వాన్ (33) మృతి చెందాడు.
కుటుంబ పోషణ కోసం కార్పెంటర్‌గా పనిచేస్తున్న రిజ్వాన్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికులను కలచివేశాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Posted Under AP
Editor