ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సన్మానించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు
సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రమైన షాదీ మహల్లో మహానాడు, ఎన్టీఆర్ జయంతి శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు సోమ్లా నాయక్, బయపరెడ్డి, ఓబులప్ప నాయుడు, రత్నమయ్య,సోమశేఖర్ రెడ్డి,రషీద్ ఖాన్ తదితరులను ఘనంగా సన్మానించారు.
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి శుభ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ అణగారిన వర్గాలకు అండగా పసుపు జెండాను నిలబెట్టారు,వారి అత్యున్నతకి బాటలు వేశారని, ప్రజల ప్రగతి కోసం టిడిపిని అంకితం చేశారని,అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా నేనున్నానంటూ ప్రజలకు అండగా నిలిచారని, అన్నగారు తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ఘన చరిత్ర కలిగి ఉండడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మొదటి కారణమని, కార్యకర్తల కృషి వలన కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలిపారు.
ఈ కార్యక్రమం కి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
