తాడిమర్రి (yes9tv )రాష్ట్రంలో 4వ స్థానం.. రాయలసీమలో నెంబర్-1గా నిలిచిన ధర్మవరం టీడీపీ
పసుపుమయంగా మారిన నియోజకవర్గం.. వేలాది కార్యకర్తలతో ఘనంగా మహానాడు నిర్వహణ
ధర్మవరం, మే 28:
తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయిలో హైబ్రిడ్ విధానంలో వర్చువల్గా నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు సాధించింది. కార్యకర్తల హాజరు శాతంలో రాష్ట్రవ్యాప్తంగా 4వ స్థానం, రాయలసీమ ప్రాంతంలో మొదటి స్థానం సాధించి ధర్మవరం టీడీపీ శ్రేణులు తమ సత్తా చాటాయి. నియోజకవర్గం మొత్తం పసుపు జెండాలతో కళకళలాడగా, జై తెలుగుదేశం నినాదాలతో రాజకీయ పండుగ వాతావరణం నెలకొంది.
నియోజకవర్గ వ్యాప్తంగా 12 క్లస్టర్ల పరిధిలో మహానాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా, వేలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తొలి రోజు ఆరు ప్రాంతాల్లో స్వయంగా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
ముందుగా తాడిమర్రి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని జై తెలుగుదేశం నినాదాలతో తాడిమర్రిని మారుమోగించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. అనంతరం బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన మహానాడులో ఎంపీ పార్థసారథి, నియోజకవర్గ అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, అమరుడు పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి, ముదిగుబ్బ కేంద్రంలోని బాలాజీ కళ్యాణ మండపం, ధర్మవరం రూరల్ మండలంలోని ఏలుకుంట్ల గ్రామం, బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్.కే. ఫంక్షన్ హాల్, రామాపురం గ్రామాల్లో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో కూడా పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో మహానాడుకు వెళ్లేందుకు కార్యకర్తలు ఎన్నో వ్యయప్రయాసలు పడేవారని, ప్రస్తుతం వర్చువల్ విధానంతో ప్రతి ప్రాంతంలోనే మహానాడు నిర్వహించుకునే అవకాశం వచ్చిందన్నారు. 12 క్లస్టర్ల పరిధిలో వేలాది మంది పాల్గొనడం ద్వారా ధర్మవరం టీడీపీ బలం మరోసారి రాష్ట్రానికి తెలిసిందన్నారు.
మహానాడులో ఆమోదం పొందనున్న 20 కీలక తీర్మానాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల నారా లోకేష్ బత్తలపల్లి పర్యటనకు లభించిన అపూర్వ స్పందనతో రాష్ట్రం మొత్తం ధర్మవరం వైపు చూసిందన్నారు. అదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గత కొంతకాలంగా కొన్ని ప్రాంతాల్లో పార్టీ క్యాడర్లో నిరుత్సాహం ఉన్నప్పటికీ, ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన బాధ్యత మనందరిదని పేర్కొన్నారు. విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. జూన్ నెల నుంచి గ్రామ గ్రామాన టీడీపీ సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
ధర్మవరం టీడీపీ ఘనత: మహానాడు హాజరులో రాష్ట్రంలో 4వ స్థానం, రాయలసీమలో నెంబర్-1
