జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర బక్రీద్ పండుగ (ఈద్ – ఉల్ – అధా) శుభాకాంక్షలు తెలుపుతూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని గౌ.జిల్లా ఇంచార్జి మంత్రి మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గౌ. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక మరియు శాసన సభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసన మండలి సభ్యులు, ఎంఎల్ఏలు, డిఆర్ఓ మలోల తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ పండుగ (ఈద్ – ఉల్ – అధా) ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ అని త్యాగానికి, దాతృత్వానికి ప్రతీక అని, ముస్లిం సోదర సోదరీమణులు సుఖ సంతోషాలతో సుహృద్భావ వాతావరణంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని, అలాగే ఆవులు, ఒంటెలను వధించడం వంటివి చేయరాదని వారు కోరారు.
