రీసర్వే పనులను వేగవంతం చేయాలి నార్పల మండలం చామలూరులో పనుల తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్..

రీసర్వే పనులను వేగవంతం చేయాలి నార్పల మండలం చామలూరులో పనుల తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్

అనంతపురం, జిల్లా నార్పల రీసర్వే పనులను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నార్పల మండలం చామలూరు గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
రీసర్వే కింద చేపడుతున్న గ్రౌండ్ ట్రూతింగ్, భూ వివరాల పరిశీలన, సర్వే ప్రక్రియల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రీసర్వే పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంచార్జి కలెక్టర్, అదనపు టీములను ఏర్పాటు చేసి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీసర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి రీసర్వే ప్రక్రియపై వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం చామలూరు గ్రామంలోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. బీఎల్ఓలతో సమావేశమై ఫ్యామిలీ మ్యాపింగ్ పురోగతిపై ఆరా తీశారు. బీఎల్ఓ మొబైల్ అప్లికేషన్‌లో ఫ్యామిలీ మ్యాపింగ్ ఎంత శాతం పూర్తయిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్ మూర్తి, మండల సర్వేయర్ బ్రహ్మానందం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor