*బళ్లారిలో అధికారిగల వారధి దిన పత్రిక నూతన కార్యాలయం ప్రారంభోత్సవం.*
*ముఖ్య అధితులుగా ఆలూరు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ నాయకులు
కర్ణాటక రాష్టంలో బల్లారి జిల్లా కేంద్రంలో గురువారం (ఐజేయు) ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో బళ్లారి నడుబొడ్డున రాయల్ సర్కిల్ సమీపంలో అధికారిగల వారధి ప్రింట్ మరియు గరుఢ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యాలయం ప్రారంభోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా కర్ణాటక స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు శికండి సినిమా ప్రొడ్యూసర్ పోలా ప్రవీణ్ కుమార్ మరియు సినిమా బృందం పాల్గొన్నారు. అనంతరం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆలూరు ఏపీయూడబ్ల్యూజే నాయకులు గోపాల్ నాయుడు మాట్లాడుతూ, సమాజంలో జర్నలిస్ట్ యొక్క ఆవశ్యకథ ఎంతైనా ఉంది అని సందర్బంగా తెలిపారు. అలాగే రాజకీయ, పరిపాలన పరంగా సమాజంలో మార్పులు గాని, ప్రజల్లో చైతన్యం తేవాలన్నా పత్రిక మరియు టీవీ ఛానల్ ప్రాముఖ్యత చాలా ఉంది అన్నారు. జర్నలిస్టులు సమాజం కోసం మరియు ప్రజల శ్రేయస్సు కోసం, తమ ప్రాణాలు పణంగా పెట్టి వార్తలు సేకరించి, అభివృద్ధికి తొడ్పాటు అందించేవారు మన పత్రిక విలేకరులు అని ఈ సందర్బంగా తెలిపారు. బల్లారి జిల్లా ఐజేయు అధ్యక్షుడు ఎర్రగుడి రమేష్ ఆహ్వానం మేరకు, ఆంధ్రప్రదేశ్ ఆలూరు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులను నూతన పత్రిక కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఆలూరు ఏపీయూడబ్ల్యూజే మండలం అధ్యక్షులు గోపాల్ నాయుడు, ఉపాధ్యక్షలు గుత్తి నాగరాజు మరియు సీనియర్ జర్నలిస్ట్ దానిల్, రంగస్వామి, వాల్మీకి వీరేష్, రామ్ మోహన్, ఛత్రపతి, హనుమేష్, చిన్న సోమన్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రదినిధులు పాల్గొన్నారు.
