ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి….

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

  • ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
  • రైతులకు పంటలపై అవగాహన కల్పించాలి..
  • అనంత పాల దాణ పథకం ద్వారా లబ్ధి పొందాలి..
  • జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

రైతులకు పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం కనేకల్ మండలం సోల్లాపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అనంత పాల దానా పథకం పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పలువురు రైతులకు పశు దాన బస్తాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ అధికారుల ద్వారా వివిధ పంట సాగు లపై అవగాహన పెంచుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినం చేసుకోవాలన్నారు.
ముఖ్యంగా ఫ్రీ మాన్సూన్ డ్రైషోన్ (పీఎండీఎస్) గురించి తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కనేకల్ మండలం లో వర్షం కురిసే అవకాశం ఉన్నందున రైతుల ముందస్తుగా పలు రకాల విత్తనాలను సీజన్ కు ముందుగా వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఏపీ ఏ ఐ ఎం ఎస్ యాప్ ను రైతులందరూ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం వల్లభా కంపెనీ ద్వారా తయారయ్యే పశుధానాను మధ్యవర్తలు లేకుండా నేరుగా రైతులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ విధానం వల్ల రైతులకు నాణ్యమైన దానా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. సదరు సరఫరాను పిఎసిఎస్ గోదాముల ద్వారా అమలు చేస్తూ రెండు వారాలలో రైతులుగా అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో రూ.1350 ఉండగా 50 కేజీల దాన బస్తాను ప్రభుత్వం రూ.1125 లకే అందిస్తూ ఒక బస్తాపై రూ.225 ఆదా (సుమారు 16.7%) కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయపరంగా రైతులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్షాలు మొదలైన వెంటనే ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ విధానాన్ని అనుసరించాలన్నారు. తద్వారా వెంటనే విత్తనాలు మొలకెత్తి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా రైతులు లబ్ధి పొందవచ్చును అన్నారు. అలాగే పశువులో మంచి పోషకాన్ని పెంచుకోవడానికి మంచి సమయం అని అన్నారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది ఎంతో ప్రయోజనాకరంగా ఉంటుందన్నారు. అదేవిధంగా నీటి వనరులను సమర్థంగా వినియోగించేందుకు ట్యాంక్ బెడ్ కల్టివేషన్ పై దృష్టి పెట్టాలని సూచించారు చెరువుల అడుగు భాగంలో పశుగ్రాసాన్ని వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునని కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం జలజారా కార్యక్రమంలో ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
గ్రామంలో నీటి ఎద్దడి నివారించేందుకు పైపులైన్ల ద్వారా మరమ్మత్తులు మరియు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంపై గ్రామస్తులతో పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. మైక్రో ఇరిగేషన్ ( బిందు సేద్యం) కోసం ఎటువంటి పరిమితులు లేవని ఎంతమంది రైతులైనా దరఖాస్తు చేసుకొవచ్చునని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది దాదాపు 23 వేల హెక్టార్లలో సుమారు 60 వేల ఎకరాలు మైక్రో ఇరిగేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వంద్వారా వ్యవసాయ పనిముట్ల మంజూరు లో భాగంగా ట్రాక్టర్లు స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాల కోసం కూడా ప్రభుత్వం రైతులు కల్పిస్తోందని రైతులు వీటిని సద్వినియం చేసుకోవాలని సూచించారు. దళారీల ప్రమేయం లేకుండా మధ్యవర్తులు లేకుండా నేరుగా కంపెనీల నుంచి రైతులకు లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ అందిస్తున్న ఫీడ్ వాడడం వల్ల పాలు ఉత్పత్తి పెరగడంతో పాటు పశువుల గర్భాధారణ శాతం కూడా మెరుగుపడుతున్నట్లు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ప్రేమ్ చoద్ డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి డా.శైలజ డా.వెంకటరెడ్డి పలువురు రైతులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor