అనంతపురం జిల్లా, రాయదుర్గం.
కనేకల్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాణపు పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఎటువంటి అవసరం లేకుండా నాణ్యమైన పనులతో కూడిన గదులను నిర్మించాలని ఈ రమణారెడ్డిని ఆదేశించారు.
కార్యక్రమంలో తాసిల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో విజయసింహారెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో షేక్షావలి నాయకులు వన్నారెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి పరిపాలపరమైన విషయాలపై పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
