ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పుట్టినరోజు వేడుకలు..

*ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పుట్టినరోజు వేడుకలు..*

– *విజయవాడలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, సహచర మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*

– *: మంత్రి పయ్యావుల కేశవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్, సహచర మంత్రులు.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పయ్యావుల కేశవ్..*

– *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి పయ్యావుల కేశవ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, సహచర మంత్రుల సమక్షంలో మంత్రి పయ్యావుల కేశవ్ కేక్ కట్ చేయగా, సహచర మంత్రులు మంత్రి కేశవ్ కి ఆప్యాయంగా కేక్ తినిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి. వంగలపూడి అనిత, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, సహచర మంత్రులు మంత్రి పయ్యావుల కేశవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు మంత్రి పయ్యావుల కేశవ్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు.*

Posted Under AP
Editor