Latest Posts

రాయదుర్గంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు: కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిల పంపిణీ, బాణసంచా సందడి

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (NDA) కూటమి వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి మరియు అస్సాం రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా

రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు మిత్రులతో కలిసి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఇంచార్జ్ శ్రీ కాపు రామచంద్రారెడ్డి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పరస్పరం అభినందనలు తెలియజేసుకుని, పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు మరియు పార్టీపై ప్రజల విశ్వాసమే ఈ విజయానికి కారణమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు SIR కమిటీ నియోజకవర్గ ఇంచార్జ్ జి.వి. నాయుడు (నాని) , మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు డిష్ గోవింద్, వన్నూరప్ప, శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్, మాజీ హీరేహాల్ మండల కన్వీనర్ బోయ వన్నూరు స్వామి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రాళ్ల తిమ్మారెడ్డి, ఎంపీటీసీ కళ్లెం సురేష్ , మాజీ సర్పంచ్ నాగరాజు, డాక్టర్ మల్లికార్జున్, జకాతి కృష్ణ , చదం తిప్పయ్య స్వామి, వాల్మీకి పవన్ మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Posted Under AP
Editor